ఏడ్చింది నిజమే కానీ... ధోనీ అవుటైనప్పుడు కాదు: ఫొటోగ్రాఫర్ వివరణ!

  • ధోనీ అవుటైనప్పుడు ఏడ్చిన ఫొటోగ్రాఫర్
  • అది క్రికెట్ మ్యాచ్ లో ఫొటో కాదని వివరణ
  • ఫుట్ బాల్ లో తన దేశపు జట్టు ఒడినప్పటిదన్న ఫొటోగ్రాఫర్
గత వారం వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా న్యూజిలాండ్‌ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోనీ అవుట్ కావడం అభిమానులకు షాకిచ్చింది. ఈ మ్యాచ్ ని కవర్ చేసేందుకు వచ్చిన ఓ ఫొటో జర్నలిస్ట్, ధోనీ అవుట్ కాగానే కన్నీరు పెట్టుకున్నారంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన ఫొటోను చూశారుగా. అయితే అది ఫేక్ ఫొటో. ఈ విషయాన్ని సదరు ఫొటోగ్రాఫరే స్వయంగా చెప్పుకొచ్చాడు. తాను ఏడ్చిన మాట నిజమే కానీ, అది న్యూజిలాండ్, ఇండియా మ్యాచ్ లో కాదని, ధోనీ అవుట్ అయినప్పుడు అసలే కాదని స్పష్టం చేశాడు.

ఆసియా ఫుట్‌ బాల్‌ కప్‌ లో భాగంగా ఖతార్‌ తో ఇరాక్ తలపడి ఓడిపోయిన సమయంలో తాను ఏడ్చానని చెప్పాడు. ఇరాక్‌ ఫోటోగ్రాఫర్‌ ను అయిన తనకు ఆ సమయంలో ఏడుపు వచ్చిందని అన్నాడు. అయితే ఆ ఫొటోను తీసుకొని కొందరు ధోని ఔటనప్పుడు ఏడ్చినట్టు నెట్టింట్లో పోస్ట్‌ చేయగా, ఆయన అభిమానులు దాన్ని తెగ షేర్‌ చేశారు.
Go Back to Shorts
MS Dhoni
Photographer
India
Cricket

More Telugu News